అంటే.. హాఫ్ మిలియన్ డాలర్స్ కి దగ్గరలో నాని సినిమా.!

Published on Jun 11, 2022 12:00 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ నటి నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “అంటే సుందరానికి” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ మౌత్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లను రాబడుతుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం తాలూకా ఓవర్సీస్ ఫస్ట్ డే మరియు ప్రీమియర్స్ వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి.

ఈ చిత్రం ప్రీమియర్ డే మరియు ఫస్ట్ డే కలిపి 4 లక్షలకి పైగా డాలర్స్ ని వసూలు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే మరి మరో రోజుకి అయితే డెఫినెట్ గా హాఫ్ మిలియన్ మార్క్ ని టచ్ చేసేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే అంటే సుందరం హవా నాని కెరీర్ లో మరో 1 మిలియన్ కి తీసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :