నాని “అంటే సుందరానికీ” ప్రోమో సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Published on Jun 5, 2022 12:00 am IST

న్యాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అంటే సుందరానికీ”. నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రోమో సాంగ్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేశారు. జూన్ 6వ తేది ఉదయం 11:07 నిమిషాలకు ప్రోమో సాంగ్‌ని రిలీజ్ చేస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం :