నాని ‘అంటే సుందరానికి’ ఓటిటి రిలీజ్ ఫిక్స్ అయిందా … ??

Published on Jun 25, 2022 10:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి. రొమాంటిక్ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా మూవీలో నాని క్యారెక్టర్, నజ్రియా అందం, అభినయం, మ్యూజిక్, దర్శకుడు వివేక్ తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకున్నాయి.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ జులై 8న ప్రముఖ ఒటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం పలు ఓటిటి సంస్థలు పోటీ పడగా ఫైనల్ గా అత్యధిక ధరకు దీని ప్రసార హక్కలు నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. అంటే దీనిని బట్టి మరొక పదమూడు రోజుల్లో సుందరం ఓటిటి ఆడియన్స్ ముందుకు రానున్నాడన్నమాట.

సంబంధిత సమాచారం :