ఓటిటీ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న నాని ‘అంటే సుందరానికి’

Published on Jul 12, 2022 6:00 pm IST


నాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహాద్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ తెరేక్కించిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఒక బ్రాహ్మణ యువకుడిగా, నజ్రియా క్రిస్టియన్ యువతీ గా నటించి ఆడియన్స్ ని తమ నటనతో ఆకట్టుకున్నారు. పాత కాన్సెప్ట్ అయినపప్పటికీ కథకి మంచి ఎంటర్టైన్మెంట్, రోమాంటిక్ అంశాలతో పాటు ఎమోషనల్ టచ్ ఇచ్చి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు వివేక్ ఆత్రేయ.

మొన్న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ఏకంగా ఇండియాలోని ఓటిటి టాప్ టెన్ మూవీస్ లో నెంబర్ వన్ స్థానములో కొనసాగుతోంది. సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ యూనివర్సల్ అపీల్ కలిగి ఉండడం, అలానే మూవీలో ప్రతి ఒక్క యాక్టర్ కనబరిచిన అద్భుత నటన, దర్శకుడు వివేక్ ఆత్రేయ మూవీని గొప్పగా తెరక్కించిన తీరు, వివేక్ సాగర్ అందించిన సోల్ ఫుల్ మ్యూజిక్, బీజీఎమ్ ఈ మూవీకి ఈ రేంజ్ లో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేశాయని అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా తమ మూవీ ప్రస్తుతం ఇంత మంచి క్రేజ్ తో ఓటిటీలో దూసుకెళ్తుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :