ఉగాది రోజున నానికి మర్చిపోలేని బహుమతి !

29th, March 2017 - 10:48:39 AM


వరుసగా డబుల్ హ్యాట్రిక్ హిట్లు సాధించి కెరీర్లో మంచి స్థాయికి ఎదుగుతున్న నేచ్యురల్ స్టార్ నానికి ఈ ఉగాది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మారింది. పండుగ శుభాకాక్షలతో పాటు ఆయనకు ఈరోజు వెలకట్టలేని బహుమతి కూడా లభించింది. ఈరోజు ఉదయం నాని తండ్రయ్యాడు. ఆయన భార్య అంజన మగబిడ్డకు జన్మనిచ్చింది.

తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆర్జేగా పనిచేసే రోజుల్లో నాని, అంజన ప్రేమించుకుని ఐదేళ్ల తర్వాత 2012 అక్టోబర్లో వివాహం చేసుకున్నారు. ఈ సందర్బంగా నాని, అంజన దంపతులకు 123తెలుగు.కామ్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ప్రస్తుతం నాని నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు.