మరో ఇంట్రెస్టింగ్ లుక్ లో సాలిడ్ అప్డేట్ తో నాని..!

Published on Oct 30, 2021 5:02 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో తన కెరీర్ లో అధిక బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కోసం నాని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన గత సినిమాల్లా కాకుండా నాని ఈ సినిమాలో కంప్లీట్ కొత్త మేకోవర్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా నానితో ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఈ లేటెస్ట్ అప్డేట్ తో తెలిసింది.

ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నవంబర్ 6న ఈ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. పైగా ఈ సాంగ్ లో నాని లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ అదిరిపోయింది. దీనితో ఓ పక్క ఈ సినిమా అప్డేట్ తో పాటుగా నాని కొత్త లుక్ కూడా మంచి కిక్ ఇవ్వడంతో నాని ఫ్యాన్స్ ఈ అప్డేట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ అద్భుతమైన సంగీతం ఇచ్చినట్టు కూడా బజ్ ఉంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More