త్రివిక్రమ్ తో అటువంటి సినిమా చేస్తాను – హీరో నాని

Published on Mar 23, 2023 10:00 pm IST

నాని తో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన ఈ మాస్ యాక్షన్ మూవీ మార్చి 30న గ్రాండ్ గా పలు భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ కానుంది. మరోవైపు ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ అందించిన సాంగ్స్ తో పాటు ట్రైలర్, టీజర్ వంటివి కూడా ఎంతో ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో నాని ఫ్యాన్స్ తో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి పలు భాషల ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు నాని.

అందులో భాగంగా నేడు మీడియాతో నాని మాట్లాడుతూ, సినిమా పై తామందరికీ ఎంతో మంచి నమ్మకం ఉందని, రిలీజ్ తరువాత అందరి అంచనాలు అందుకుంటుందని అన్నారు. ఇక టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ గురించి నాని మాట్లాడుతూ, త్రివిక్రమ్ ఇటీవల కలిసినపుడు నాకోసం ఒక స్క్రిప్ట్ రాయాలని చెప్పారని అన్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో ఆయనతో తన కాంబినేషన్ లో మూవీ వస్తే తప్పకుండా అది తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయేలా అద్భుతంగా ఉండేలా చూసుకుంటానని అన్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :