‘నేను లోకల్’ క్రిస్‌మస్‍కే వచ్చేస్తుందన్న నాని!

nani2
‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘జెంటిల్‌మన్’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకొని దూసుకుపోతోన్న నాని నటించిన కొత్త సినిమా ‘మజ్ఞు’ ఈ వారమే విడుదలవుతోంది. దీంతో 2016 లో నాని నటించిన మూడు సినిమాలు అప్పుడే వచ్చేసినట్లైంది. ఇక వీటికి తోడు తదుపరి సినిమా ‘నేను లోకల్’ కూడా ఈ ఏడాదిలోనే వచ్చేస్తుందట. మజ్ను సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడూతూ.. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నేను లోకల్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని, క్రిస్‍మస్ కానుకగా డిసెంబర్ నెలాఖర్లో సినిమాను విడుదల చేయానున్నామని నాని అన్నారు.

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మజ్ను విషయానికి వస్తే విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాని స్టైల్ రొమాంటిక్ కామెడీగా ప్రచారం పొందుతోంది. ట్రైలర్, ఆడియోతో మంచి అంచనాలను రేకెత్తించిన మజ్ను, తన సక్సెస్ ట్రాక్‍ను నిలబెడుతుందని నాని ధీమాగా ఉన్నారు.