మణిరత్నం సినిమాలో నాలుగో హీరోగా నాని !

11th, September 2017 - 03:25:14 PM


స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం తన మల్టీ స్టారర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో మొత్తం నలుగురు హీరోలు నటించనున్నారు. వీరు నలుగురు వివిధ పరిశ్రమలకు చెందినవారు కావడం విశేషం. ముందుగా తమిళ హీరోలు విజయ్ సేతుపతి, శింబులను కన్ఫర్మ్ చేయగా ఆ తర్వాత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ను ఎంచుకున్నారు మణిరత్నం. ఇక చివరగా నాలుగో హీరోగా నానిని అనుకుంటున్నారట ఆయన.

అయితే నాని ఇంకా ఆ ప్రాజెక్టుకి సైన్ చేయలేదట. ఈ సినిమాలో హీరోయిన్లుగా జ్యోతిక, ఐశ్వర్య రాజేష్ లు నటించనున్నారు. అయితే ఏ హీరోయిన్ ఎవరికి జోడీగా నటిస్తుందో ఇంకా తెలీలేదు. ఇకపోతే ఈ భారీ మల్టీస్టారర్ కు ఏఆర్. రెహమాన్ సంగీతాన్ని అందివ్వనుండగా సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.