యుఎస్ఏ లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ‘దసరా’ మూవీ

Published on Mar 3, 2023 2:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో మార్చి 30న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో ధరణి పాత్రలో నాని కనిపించనుండగా వెన్నెల పాత్ర చేస్తున్నారు కీర్తి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకొని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే విషయం ఏమిటంటే, ఈ నెలాఖరులో రిలీజ్ కి సిద్ధం అవుతోన్న దసరా మూవీని యుఎస్ఏ లో భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసారు. ఈ మూవీని యుఎస్ఏ లో ప్రత్యంగిరా సినిమాస్ వారు రిలీజ్ చేయనున్నారు. అలానే ప్రీమియర్స్ ని మార్చి 29న గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. నాని కెరీర్ లో దసరా మూవీ అక్కడ హైయెస్ట్ రిలీజ్ అవుతుందని, మరోవైపు ఇటీవల మంచి కంటెంట్ తో రిలీజ్ అయిన పలు సినిమాలు యుఎస్ఏ లో బాగా పెర్ఫర్మ్ చేయడంతో, ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ కూడా తప్పకుండా యుఎస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :