నాని ‘దసరా’ రన్ టైం లాక్

Published on Mar 16, 2023 3:01 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన ఇండియన్ మూవీ దసరా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే దసరా మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని ఆడియన్స్ ని నాని ఫ్యాన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ కి యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే ఈ మూవీకి సంబంధించి నేడు ఫ్యాన్స్ తో కొద్దిసేపు ఆస్క్ నాని పేరుతో ఒక చాట్ సెషన్ నిర్వహించిన నాని, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సినిమాలో బాగా హై ఇచ్చే సీన్ ఏదైనా చెప్పు అన్న అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు నాని. నిజానికి 2 గం. 36 ని. ల నిడివి గల సినిమాలోని ప్రతి ఫ్రేమ్ మీ అందరికీ మంచి హై ని అందిస్తుందని అన్నారు. దీనితో ఈ మూవీ యొక్క రన్ టైం రివీల్ అయింది. మరోవైపు సెన్సార్ వారి నుండి ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. మరి అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన మాస్ యాక్షన్ రస్టిక్ మూవీ దసరా రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :