నాని “దసరా” రిలీజ్ విషయంలో మనసు మార్చుకున్నారా?

Published on Jun 12, 2022 12:00 am IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే నాని తన తరువాత ప్రాజెక్టుగా ‘దసరా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నేను లోకల్’ తరువాత నాని, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు.

అయితే టైటిల్‌కి తగినట్టుగా ఈ సినిమాను ముందుగా దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఈ విషయంలో నాని మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోకపోవడం వలన క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేదీ దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే రాలేదు.

సంబంధిత సమాచారం :