టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. నేటి నుండి దసరా నవరాత్రి యాత్ర ను మొదలు పెట్టనున్నారు మేకర్స్.
తాజాగా దసరా నవరాత్రి యాత్ర పేరిట పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ముంబై, నాగ్ పూర్, అహ్మదాబాద్, జై పూర్, అనంతపూర్, ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్ లలో ప్రమోషన్స్ చేయనున్నారు. మార్చ్ 30 న ఇక వరల్డ్ వైడ్ థియేటర్లలో సినిమా రిలీజ్ అంటూ చెప్పుకొచ్చారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.