‘ది ప్యారడైజ్’ పై నాని సూపర్ కాన్ఫిడెంట్..!

నేచురల్ స్టార్ నాని క్రేజీ యాక్షన్ అవతారంలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి సినిమాపై మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఎలాంటి వాయిదాలు లేకుండా సెప్టెంబర్ 24నే సినిమాను విడుదల చేస్తున్నట్లు నాని స్పష్టం చేశారు. గడువులోగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం రేయింబవళ్లు కష్టపడుతోందని, ట్రైలర్ లేకపోయినా థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అడ్రినలిన్ రష్ ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ​ఈ సినిమా కేవలం రక్తసిక్తమైన యాక్షన్ ఎపిక్ మాత్రమే కాదని, ఒక తల్లికి, కొడుక్కి మధ్య జరిగే అద్భుతమైన ఎమోషనల్ ప్రయాణమని నాని తెలిపారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆలోచనలు ఒక “మ్యాడ్ మన్” లాగా ఉంటాయని, అలాంటి పిచ్చి ఉంటేనే ఇటువంటి మాగ్నమస్ క్రియేట్ చేయగలమని ప్రశంసించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం మరియు నేపధ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. నార్త్ అమెరికాలోనూ రికార్డు స్థాయి ప్రీ-సేల్స్ జరుగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version