“హాయ్ నాన్న” షూట్ పై అప్డేట్ ఇచ్చిన నాని.!

Published on Sep 2, 2023 11:12 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ పాన్ ఇండియా చిత్రం “దసరా” తో తన కెరీర్ లో భారీ సక్సెస్ అందుకోగా ఈ చిత్రం అనంతరం మరో డెబ్యూ దర్శకుడుతో చేస్తున్న ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫామిలీ చిత్రమే “హాయ్ నాన్న”. దర్శకుడు శౌర్యువ్ ని అలాగే నిర్మాణ సంస్థ వైరా క్రియేషన్స్ వారిని కూడా పరిచయం చేస్తూ స్టార్ట్ చేసిన ఈ సినిమాపై కూడా మంచి బజ్ అయితే ఉంది.

మరి సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు కునూర్ కి చేరుకుంది. మరి ఈ షూట్ పై స్వయంగా హీరో నాని నే అప్డేట్ అందించాడు. కునూర్ లో మంచి లొకేషన్ లో తాను నించుని ఆ వాతావరణంని పరిశీలిస్తున్నాడు. దీనితో ఈ సినిమా షూట్ ప్రెజెంట్ ఇక్కడ కొనసాగుతుంది. ఇక ఈ చిత్రానికి అయితే హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందిస్తుండగా ఈ డిసెంబర్ 21న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :