ఓల్డ్ సిటీలో పోరాడుతున్న నాని !

Published on Dec 31, 2017 4:00 pm IST

ఈ ఏడాది ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంతో మరొక మంచి విజయాన్ని అందుకున్న నాని తన తదుపరి సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓల్డ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడే నాని పై పోరాట సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రెండు కూడా వేటికవే భిన్నంగా ఉంటాయని, వాటిలో మంచి ఫన్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తన గత సినిమాలు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాల్లానే ఇందులో కూడా ఎక్కువ హ్యూమర్ ఉండేలా చూస్తున్నారట. హిపాప్ తమీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More