టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. తాజాగా ఆయన ‘హాయ్ నాన్న’ మూవీ డైరెక్టర్ శౌర్యువ్‌తో కలిసి తన కొత్త ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టును తాజాగా పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కించారు. హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సమక్షంలో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేయడం విశేషం. విజయ్ దేవరకొండపై నాని ఫస్ట్ క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాని మరియు విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయ్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ‘హాయ్ నాన్న’ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
