ది ప్యారడైజ్ : శ్రీకాంత్ విజన్‌ను ఎలివేట్ చేసిన అనిరుధ్.. నాని ఫుల్ హ్యాపీ..!

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు ఓదెల శ్రీకాంత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 24న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను పలు నగరాల్లో ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

అటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ పూర్తిగా నిమగ్నమై ఉండటంతో మేకర్స్ ఈ సినిమాకు చివరి క్షణం జాప్యం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్ర రీ-రికార్డింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ విజన్‌ను స్క్రీన్‌పై తన మ్యూజిక్‌తో అనిరుధ్ ఎలివేట్ చేస్తున్న విధానంతో హీరో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

చెన్నైలో జరిగిన ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లిన నాని, మూవీ ప్రమోషన్స్ తర్వాత అనిరుధ్ స్టూడియోకు వెళ్లాడు. అక్కడ అనిరుధ్, శ్రీకాంత్ చేస్తున్న వండర్ చూసిన నాని హ్యాపీగా ఉన్నాడట. సినిమా ఫస్ట్ హాఫ్‌ను చూసిన నాని సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట. ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎల్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version