సందీప్ కిషన్ తో నాని హీరోయిన్ !

mehreen
‘రన్, ఒక అమ్మాయి తప్ప’ వంటి సినిమాలతో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన యంగ్ హీరో సందీప్ కిషన్ కాస్త ట్రాక్ మార్చి స్పీడు పెంచి వరుసగా భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో కిష్ణ వంశీ డైరెక్షన్లో ‘నక్షత్రం’ సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తున్నాడు. అలాగే తాజాగా ఈ యువ హీరో ‘నా పేరు శివ’ ఫేమ్ సుసీంద్రన్ డైరెక్షన్లో మరో సినిమాను సైన్ చేశాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనుంది.

సందీప్ కిషన్ తెలుగులో ‘నక్షత్రం’ షూటింగ్ పూర్తి చేయగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రంలో సందీప్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ను సెలెక్ట్ చేశారట. మెహ్రీన్ తెలుగులో నాని హీరోగా చేసిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి ఇంప్రెషన్ దక్కించుకుంది. అయినా కూడా ఆమెకు చాలా రోజులు తెలుగులో సరైన ఆఫర్ రాలేదు. కొంత కాలం క్రితం ఒక సినిమా సైన్ చేసినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఇంకా ప్రీప్రొడక్షన్ దశలోనే ఉండిపోయింది.