అల్లు శిరీష్ సరసన నాని హీరోయిన్ !

9th, April 2017 - 01:36:09 PM


గతేడాది ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజే ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో శిరీష్ సరసన నాని హీరోయిన్ నటించనుంది.

ఆమే గతేడాది ‘జెంటిల్మెన్’ చిత్రంతో తెలుగువారికి బాగా పరిచయమైన సురభి. ఈమెతో పాటే ‘రన్ రాజ రన్’ తో ప్రేక్షకులకు పరిచయమైన శీరత్ కపూర్, దర్శకుడు, నటుడు అయిన శ్రీనివాస అవసరాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలకు ఇంకా తెలియాల్సి ఉంది.