విజయ్ దేవరకొండ సరసన నాని హీరోయిన్ !


టాలీవుడ్ యంగ్ హీరోల్లో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ‘ది ఎండ్’ చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరైనా తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందని ఆలోచించిన దర్శక నిర్మాతలు మాళవికా నాయర్ ను పరిశీలిస్తున్నారట.

నాని చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై, ‘కళ్యాణ వైభోగమే’ తో మంచి నటిగా గుర్తింపు పొందింది మాళవికా నాయర్. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో విజయ్ ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇకపోతే ఈయన నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఆగష్టు 25 న రిలీజ్ కానుంది.