యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మరో 1 మిలియన్ కొట్టేసిన నాని.!

యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మరో 1 మిలియన్ కొట్టేసిన నాని.!

Published on Jun 17, 2022 4:00 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అంటే సుందరానికీ” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ నటి నజ్రియా ఫహద్ నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. అయితే మంచి ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే మంచి హిట్ గా నిలిచింది.

ఫస్ట్ వీకెండ్ లోనే సాలిడ్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు వారానికి రికార్డు మైల్ స్టోన్ 1 మిలియన్ మార్క్ ని లేటెస్ట్ గా క్రాస్ చేసేసింది. దీనితో నాని ఖాతాలో మరో 1 మిలియన్ డాలర్ సినిమాగా అంటే సుందరానికీ చేరగా టాలీవుడ్ నుంచి అత్యధిక 1 మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన అతి తక్కువ మంది హీరోస్ లో ఒకడిగా నాని నిలిచాడు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు