హ్యాట్రిక్ కొట్టేసిన నాని !

హీరో నాని హ్యాట్రిక్ కొట్టేశారు. ఓవర్సీస్లో బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఆయన తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తో మిలియన్ డాలర్ మార్కును అందుకున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 1,000,606 డాలర్లను అందుకుంది. దీంతో ఈ ఏడాది వరుసగా మూడు మిలియన డాలర్లను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ అందుకున్నారాయన.

ఈ సంవత్సరంలో ‘నేను లోకల్, నిన్నుకోరి’ వంటి సినిమాలు మిలియన్ డాలర్ మార్కును అందుకోగా ఇప్పుడు ‘ఎం.సి.ఏ’ ఆ జాబితాలోకి చేరింది. దీంతో ఓవర్సీస్లో నాని హవాకు తిరుగులేదని అర్థమవుతోంది. అంతేగాక తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ చిత్రం అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో కలెక్షన్స్ మంచి స్థాయిలో ఉన్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.