భారతీయ చిత్ర పరిశ్రమకి ప్రధాన బలం కమర్షియల్ సినిమాలే – హీరో నాని

Published on Mar 9, 2023 9:11 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియన్ మూవీ దసరా. ఈ నెల 30న పలు భాషల్లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈమూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీగా నిర్మించారు. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన దసరా ప్రచార చిత్రాలతో పాటు సాంగ్స్ కూడా ఆకట్టుకుని మూవీ పై నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక సినిమా రిలీజ్ కి సమయం మరింత దగ్గర పడుతూ ఉండడంతో హీరో నాని విరివిగా పలు భాషల్లో దసరా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అందులో భాగంగా నేడు ఒక ఇంటర్వ్యూ లో నాని మాట్లాడుతూ, భారతీయ సినిమా పరిశ్రమకి కమర్షివల్ సినిమాలు పెద్ద బలం అని అన్నారు. ఇక్కడ అనేకమంది అటువంటి సినిమాల భారీ సక్సెస్ ల ద్వారానే ధనార్జన చేయగలుగుతున్నారని, అలాగని మంచి కాన్సెప్ట్స్ తో పాటు మెసేజ్ తో వస్తున్న సినిమాలను తాను తక్కువ చేయడం లేదని తెలిపారు నాని. ఇక దసరా సినిమా కోసం యావత్ యూనిట్ రేయింబవళ్లు ఎంతో శ్రమ పడ్డారని తప్పకుండా మార్చి 30న రిలీజ్ తరువాత తమ సినిమా అన్ని భాషల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :