తన బర్త్ డే పై ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ పోస్ట్ పెట్టిన నాని.!

Published on Feb 24, 2023 2:00 pm IST

ఈరోజు మన టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా అభిమానులు ఓ రేంజ్ లో తన బర్త్ డే ని జరుపుకుంటూ ఉండగా ఈరోజు ఉదయం నుంచే అనేకమంది సినీ ప్రముఖులు నాని కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనితో నాని అయితే తన బర్త్ డే కి తన స్టైల్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం ఆసక్తిగా మారింది.

సినిమాలో తన స్వయం కృషి తో హీరోగా ఎదిగిన నాని అదే సినిమాటిక్ గా నేను 1984 ఫిబ్రవరి 24న రిలీజ్ అయ్యాను నేను గత 15 ఏళ్లలో మళ్ళీ ఇదే శుక్రవారాల్లో ప్రతి సారి పుడుతున్నానని అలాగే ఈసారి వచ్చిన శుక్రవారం బర్త్ డే లానే మీతో మరిన్ని జరుపుకోవాలని అనుకుంటున్నట్టుగా నాని తెలిపాడు.

దీనితో సినిమాలోకి వచ్చి సినిమానే ప్రపంచంగా భావించే తాను ఈ పోస్ట్ తో అయితే తనకు సినిమా పట్ల ఉన్న మక్కువ ఏ రీతిలో ఉందో అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక నాని అయితే లేటెస్ట్ గా భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :