మహేష్ సపోర్ట్ కి నాని అదిరే రిప్లై వైరల్.!

Published on Apr 1, 2023 8:01 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి వచ్చి పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషనల్ హిట్ అయ్యిన మాస్ చిత్రం “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన పక్కా నాటు యాక్షన్ డ్రామా అంచనాలు అందుకొని నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి ఆల్ మోస్ట్ టైర్ 1 హీరో లెవెల్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది.

మరి ఏ సినిమా వచ్చినా దానికి అభినందనలు అందించడంలో ఎప్పుడూ ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకి కూడా ఓ రేంజ్ లో తన రెస్పాన్స్ ని అందించారు. ఇక దీనికి కూడా నాని మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే రిప్లై అందించాడు. మహేష్ కి సినిమా విషయంలో థాంక్స్ చెప్తూ మీరు మంచి సినిమాల పట్ల ఇచ్చే వాయిస్ సపోర్ట్ ఎలా ఉంది అంటే పోకిరి సినిమాకి మణిశర్మ గారి స్కోర్ అందించినట్టుగా ఉంటుంది అని అదిరే రిప్లై అందించాడు. దీనితో మహేష్ ఫ్యాన్స్ అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :