మార్చి 30, ఎట్లైతే గట్లయే సూస్కుందాం – నాని

Published on Mar 15, 2023 11:30 am IST

టాలీవుడ్ స్టార్ హీరో, నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. టైటిల్ అనౌన్స్ మెంట్ నుండి ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మార్చ్ 30 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేయగా అద్దిరిపొయే రెస్పాన్స్ వస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియా లో హీరో నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. మార్చి 30, ఎట్లైతే గట్లయే సూస్కుందాం అంటూ పోస్ట్ చేశారు. అన్ని మెసేజెస్ ను చదివా, మీ అందరి ప్రేమను పొందా అంటూ తెలిపారు. దీంతో పాటుగా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఒక ఫోటో ను షేర్ చేశారు నాని. చేతిలో ఫోన్ పట్టుకొని, స్మైల్ ఇస్తూ కనిపించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దసరా చిత్రం లో హీరో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు తో పాటుగా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :