
యువ హీరో నాని ఎట్టకేలకు ఆనందంలో వున్నాడు. వరుస పరాజయాల తరువాత విడుదలైన జెండా పై కపిరాజు మరియు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
ఈ రెండు సినిమాల ఫలితం నానిని సంతృప్తి పరిచాయి. జెండాపై కపిరాజు మాస్ ప్రేక్షకులను మెప్పించాగా ఎవడే సుబ్రహ్మణ్యం క్లాస్ ప్రేక్షకులను అలరించింది.
నాని స్టోరీ సెలక్షన్ కి, అతని నటనకి ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం నాని మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నటిస్తున్నాడు.