టైటిల్ ను జస్టిఫై చేసేలా నాని లుక్ !

నేచ్యురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. సినిమా సినిమాకు కథలోనూ, తన పాత్రలోనూ పూర్తి భిన్నత్వాన్ని చూపిస్తున్న నాని ఈసారి మధ్యతరగతి కుర్రాడిలా కనిపించనున్నాడు. దీపావళి సందర్బంగా కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో నాని లుంగీ కట్టుకుని, చేతిలో పాల ప్యాకెట్ తో అచ్చు రెగ్యులర్ మిడిల్ క్లాస్ కుర్రాడిలానే కనిపిస్తూ టైటిల్ కు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు.

నాని గత సినిమాలు వరుసగా హ్యాట్రిక్ విజయాల్ని అందుకోవడం, ‘ఫిదా’ తో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయిన సాయి పల్లవి నాని సరసం నటిస్తుండటంతో వీరిద్దరి కలయిక ఎలా ఉంటుందో చూడాలని ఈ చిత్రంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. నూతన దర్శకుడు వేణు శరీర, డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మసితుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.