త్వరలో నాని, కిషోర్ తిరుమల సినిమా ప్రారంభం !

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నాని నటించిన తాజా సినిమా కృష్ణార్జున యుద్ధం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. నాని ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రెండు హీరో పాత్రలేనని సమాచారం. ఈ సినిమా తరువాత నాని మరో సినిమాని అంగీకరించాడు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించేందుకు ఈ హీరో సిద్దమయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా మార్చి రెండోవారంలో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత కిషోర్ తిరుమల చేస్తోన్న ఇదేఅవ్వడం విశేషం. నాని నిర్మాతగా మారి చేస్తోన్న అ సినిమా టిజర్ ఈరోజు విడుదల కానుంది.