“దసరా” పై కేజ్రీగా మారిన నాని పోస్ట్.!

Published on Jan 27, 2023 5:00 pm IST

నాచురల్ స్టార్ నాని ని నాటు రల్ స్టార్ నాని గా మార్చిన లేటెస్ట్ సాలిడ్ మాస్ చిత్రం “దసరా”. దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ పాన్ ఇండియా సినిమా నాని కెరీర్ లోనే భారీ అంచనాలు నెలకొల్పుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాపై హైప్ కూడా నాని ఫ్యాన్స్ లో అంతకంతకూ పెరుగుతూ వస్తుండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ రూమర్ వైరల్ గా మారింది. దసరా కి కూడా బహుశా సీక్వెల్ ఉండొచ్చు అనే టాక్ స్టార్ట్ కాగా దీనిపైనే అన్నట్టుగా నాని వెంటంటే పెట్టిన లేటెస్ట్ పోస్ట్ కేజ్రీగా మారింది.

“జస్ట్ ఒకటే కాకపోతే రెండిటి కన్నా లేకపోతే అంతకన్నా ఎక్కువే” అన్నట్టుగా పోస్ట్ పెట్టాడు. దీనితో దసరా సినిమా ఒకటే కానీ దానిలోనే ఎనో సీక్వెల్స్ తాలూకా పవర్ ఉంది అన్నట్టుగా తాను స్పందించాడు. దీనితో దసరా పై అయితే తన సాలిడ్ రియాక్షన్ యిట్టె వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం :