వైరల్ పిక్ : తన భార్య అంజనకు నాని లవ్లీ బర్త్ డే విషెస్

వైరల్ పిక్ : తన భార్య అంజనకు నాని లవ్లీ బర్త్ డే విషెస్

Published on Nov 23, 2022 11:54 PM IST


టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అటు హీరోగా ఇటు నిర్మాతగా కూడా మంచి సక్సెస్ లతో జోరుమీద కొనసాగుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తో ఆయన చేస్తున్న మూవీ దసరా. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ తో కూడిన రస్టిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుండగా దీనిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలను గురించి ఫ్యాన్స్, ఆడియన్స్ తో పంచుకునే అలవాటు గల నాని, నేడు తన భార్య అంజన కు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియచేస్తూ కొన్నేళ్ల క్రితం ఇద్దరూ కలిసి దిగిన ఒక లవ్లీ పిక్ ని పోస్ట్ చేసారు. నువ్వు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, హ్యాపీ బర్త్ డే టూ యు అంజన అంటూ నాని పోస్ట్ చేసిన ఆ బ్యూటిఫుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/ClTdbgJS5N4/?igshid=MDJmNzVkMjY=

సంబంధిత సమాచారం

తాజా వార్తలు