“అంటే సుందరానికి” ట్రైలర్, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి – నానీ

Published on Apr 20, 2022 2:01 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ సినిమా “అంటే సుందరానికి” సినిమా నుంచి మేకర్స్ ఈరోజు అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సాలిడ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో కనిపించిన ఈ టీజర్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ ను కూడా అందుకుంటుంది.

మరి ఈ ట్రైలర్ ని ఈరోజు చిత్ర యూనిట్ హైదరాబాద్ లో చిన్న ఈవెంట్ తో లాంచ్ చెయ్యగా ఈ ఈవెంట్ లో నాని షార్ట్ అండ్ స్వీట్ గా సినిమాపై మరియు తన స్పీచ్ ని అందించాడు. అయితే మొదటగా నిన్ననే టాలీవుడ్ కి జరిగిన పెద్ద నష్టం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ నారంగ్ గారిని స్మరించుకొని ముందుకు వెళ్ళాడు.

ఏ సినిమాకి చెయ్యని విధంగా ఈ ఈవెంట్ లో మొదట సినిమా యూనిట్ అంతటిని పిలిచి అభినందించాడు. అయితే ఈ సినిమా తన కెరీర్ లో ఒక స్పెషల్ సినిమా అని ఈ సినిమాని దర్శకుడు వివేక్ తప్ప మరో దర్శకుడు తియ్యలేడని ఓ సినిమా కథని మరో దర్శకుడు తియ్యొచ్చు అనే ఆలోచన రావొచ్చు కానీ వివేక్ సినిమాలకి మాత్రం అలా జరగదని తన సినిమా తాను మాత్రమే తియ్యగలడని తెలిపాడు.

అలాగే నజ్రియాని ఫస్ట్ మా సినిమాతో పరిచయం చెయ్యడం ఆనందం ఉందని ఇంకా ఇప్పుడు చూసిన టీజర్ కి రెండింతలు ట్రైలర్ ఉంటుంది దానికి పది రెట్లు సినిమా అదిరే లెవెల్లో ఉంటుంది అని అది మీరంతా చూస్తారు అని చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ఈ ఈవెంట్ లో తెలిపి ముగించాడు.

నాని స్పీచ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :