పక్కా మాస్ లుక్ లో నాని !

28th, October 2016 - 05:30:16 PM

nani-nenu-local
ఈ సంవత్సరం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్ను’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలనందుకున్న యంగ్ హీరో నాని ఈ సంవత్సరం ‘నేను లోకల్’ పేరుతో మరో చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజే విడుదల చేశారు. సినిమా సినిమాకి కథలోనూ, క్యారెక్టరైజేషన్ లోనూ కొత్తదనం చూపించే నాని ఇందులో పూర్తిగా క్లాస్ లుక్ మార్చేసి మాస లుక్ లోకి దిగిపోయాడు. ఈ లుక్ లో కూడా నాని చాలా బాగా యాప్టయ్యాడు. పేరులోనే నేను లోకల్ అంటూ లోకల్ మాస్ సౌండింగ్ నింపుకున్న ఈ చిత్రం కథ కూడా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గానే ఉండనుందట.

ఇక ఈ పోస్టర్ కూడా సోషమ్ మీడియాలో బాగానే ప్రచారం పొందుతూ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘సినిమా చూపిస్తా మామ’ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇకపొతే తమిళ స్టార్ హీరోయిన్ సురేశ్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.