నాని సినిమా జనవరికి పోస్ట్ పోన్ ?
Published on Nov 27, 2017 8:34 am IST

నాని హీరోగా వస్తున్న తాజాచిత్రం ‘ఎంసిఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టిజర్ కు మంచి స్పందన లభించింది.

ఎం.సి.ఎ సినిమాను ముందుగా డిసెంబర్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు. అఖిల్ హలో, అల్లు శిరీష్ ఒక్క క్షణం, చలో సినిమాలు వసుసగా రావడంతో నాని ఎంసిఎ చిత్రాన్ని జనవరిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా జనవరి లో పవన్ కళ్యాణ్ సినిమా బాలయ్య జై సింహ విడుదలకానున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook