ఈ స్పెషల్ డే కి నాని మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్.!

ఈ స్పెషల్ డే కి నాని మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్.!

Published on Dec 30, 2022 4:00 PM IST

టాలీవుడ్ సినిమా దగ్గర తనదైన నటనతో అయితే ప్రేక్షకులని ఎంతగానో అలరించి నాచురల్ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని. మరి తన కెరీర్ లో ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేసిన నాని ఇప్పుడు తన కెరీర్ 29న సినిమాగా అయితే ఫుల్ మాస్ మసాలా చిత్రం అందులోని తన మొదటి పాన్ ఇండియా సినిమా “దసరా” ఇప్పుడు చేస్తున్నాడు.

ఇక దీని తర్వాత అయితే నాని కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రం 30వ సినిమాపై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్ అనే నూతన నిర్మాణ సంస్థ పరిచయం అవుతూ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేయనున్నారు.

ఈ బ్యానర్ ని అయితే మోహన్ చెరుకూరి తన స్నేహితులు డాక్టర్ విజేందర్ రెడ్డి తేగల, కె ఎస్ మూర్తి లతో కలిసి సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో అయితే ఆరంభించారు. ఇక ఈ ప్రాజెక్ట్ పై రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా మంచి ప్లెజెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా అనౌన్సమెంట్ అయితే ఈ కొత్త ఏడాది 2023 జనవరి 1న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అనౌన్స్ చేయనున్నట్టుగా అయితే తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు