ఆవకాయ సీజన్‌ని ఫిక్స్ చేసుకున్న ‘అంటే సుందరానికీ’..!

Published on Jan 2, 2022 1:14 am IST

“శ్యామ్ సింగరాయ్” చిత్రంతో మంచి హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికీ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. అయితే తాజాగా జీరోత్ లుక్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ ఇందులో నానిని సుందర్‌గా పరిచయం చేశారు.

అయితే ఈ పోస్టర్‌లో నాని ఎర్రటి చొక్కా, పంచె కట్టులో కనిపిస్తూ ఓ లగేజీ సూట్‌కేసుపై రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇక ‘ఖ్.ఫ్.వ్.శ్.శ్.ఫ్.ఋ సుందర ప్రసాద్’ అంటే “కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్” అని రివీల్ చేశారు. ఇందులో నాని భాష, వేషధారణ బట్టి చూస్తుంటే బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆవకాయ సీజన్‌ని ఫిక్స్ చేసుకుందని అంటే సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వనున్నట్టు తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :