ఇప్పుడు వస్తున్న సంక్రాంతి పండుగ సందర్భంగా విడులా కాబోతున్న బడా చిత్రాల్లో కోలీవుడ్ చిత్రం “మాస్టర్” కూడా ఒకటి. థలపతి విజయ్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో పాన్ ఇండియన్ సినిమాగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పవర్ ఫుల్ విలన్ గా విజయ్ కు సమ ఉజ్జీగా సేతుపతి కనిపించాడు. మరి ఇదిలా ఉండగా ఆ పవర్ ఫుల్ రోల్ కు గాను విజయ్ సేతుపతి పేరు కాకుండా మన నాచురల్ స్టార్ నాని మరియు అక్కడి మరో సీనియర్ నటుడు మాధవన్ పేర్లు కూడా అనుకున్నారట. కానీ ముందు అయితే నిర్మాతలు సేతుపతి పేరునే అనుకున్నారు కానీ అతడు ఈ రోల్ ను ఒప్పుకుంటాడో లేదో అని ఆగారట.
కానీ ఆ తర్వాత విజయ్ సేతుపతి ఆ రోల్ ను టేకప్ చేసి అద్భుతంగా పండించారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే నాని మరియు మాధవన్ పేర్లు కూడా అనుకున్నారని విజయ్ కు పెద్ద ఫ్యాన్ మరియు అక్కడ ఓ డైరెక్టర్ అయినటువంటి రత్నకుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. నాని ఒక యాంటీ హీరోగా “వి” చిత్రంలో ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేసాడో చూసాము. అలాంటిది మాస్టర్ లో కూడా విలన్ రోల్ ను తనదైన స్టైల్ లో ఖచ్చితంగా రక్తి కట్టించి ఉండేవాడు.
