నాని ‘ఎం.సి.ఎ’ రిలీజ్ డేట్ ఖరారు !
Published on Oct 27, 2017 4:00 pm IST

నాని తాజాగా ‘ఎం.సి.ఎ’ చిత్రంలో నటిస్తున్నాడు, సాయి పల్లవి హీరోయిన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని సినిమా వస్తుందంటే ఆదరించే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ‘ఫిదా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తుండడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. షూటింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు గతంలో చెప్పినట్లు డిసెంబర్ 15 న చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు, అధికారికంగా రిలీజ్ డేట్ అనౌన్సు చెయ్యాల్సి ఉంది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో దర్శకుడు వేణు శ్రీరామ్ విజయం సాధిస్తాడని ఆశిద్దాం.

 
Like us on Facebook