అక్టోబర్ నుంచి నాని కొత్త మూవీ

nani-as-producer

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా సూపర్ హిట్ అయిన ‘పన్నాయిరుం పద్మినియుం’ సినిమా రీమేక్ రైట్స్ ని యంగ్ హీరో నాని సొంతం చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాని టీం తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేస్తున్నారు.

నాని తన సొంత నిర్మాణంలో నిర్మించనున్న ఈ సినిమాలో నటిస్తాడా లేదా అని వస్తున్న వార్తలకు తెరపడింది. ఈ సినిమాలో తానే హీరోగా చేయనున్నట్లు నాని ఖరారు చేసారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమా దర్శకత్వ బాద్యతలు ఎవరు తీసుకుంటారు, అలాగే మిగిలిన 3 కీలక పాత్రల్లో ఎవరెవరు నటిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒక పల్లెటూరిలో జరిగే ఈ కథ మొత్తం ఒక కారు చుట్టూ తిరుగుతుంది.

నాని మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘జెండాపై కపిరాజు’ చాలా రోజుల ఆలస్యం తరువాత ఆగష్టు 8న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అమలా పాల్, రాగిణి ద్వివేది హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సముద్రఖని డైరెక్టర్.

Exit mobile version