నాని నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !

ఎంసిఎ విజయం తరువాత నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరొయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 12 న విడుదల చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి మహా నటులు నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా టైటిల్ తో నాని నటిస్తుండడం విశేషం. నాని గతంలో జెండాపై క‌పిరాజు, జంటిల్ మెన్ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసాడు. మంచి కథతో రాబోతున్న ఈ సినిమా విజయం సాదించాలని కోరుకుందాం.