రాజమౌళి ‘ఈగ 2’ పై నాని కామెంట్

nani

టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన లేటెస్ట్ విజువల్ వండర్ ‘బాహుబలి’ తో పెద్ద సక్సెస్ అందుకున్నాడు. జూలైలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ఈ సిని మాకంటే ముందు విజువల్ గా రాజమౌళి ‘ఈగ’ అనే సినిమాతో ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇటీవలే రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఈగ 2 చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈగ సినిమాలో హీరోగా కాసేపే కనిపించినా సినిమా మొత్తం తన హీరో అన్న ఫీలింగ్ ని కలిగించాడు ఆ సినిమా హీరో నాని. నాని తాజాగా ఈగ 2 గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

నాని నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘భలే భలే మగాడివోయ్’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మీడియా తో మాట్లాడినప్పుడు ఈగ 2 గురించి చెప్పాడు. ‘రాజమౌళి గారు ఈగ 2 చెయ్యడానికి బాగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఎక్కువ భాగం బాహుబలి 2 ఫినిష్ అవ్వగానే ఈగ 2 మొదలయ్యే అవకాశం ఉందని’ తెలిపాడు. కానీ తను ఏమన్నా ఆ సినిమాలో కూడా నటిస్తాడా లేదా అన్న విషయాలను తెలియజేయలేదు. రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఇదయిన తర్వాతనే ఈగ 2 ఉండే అవకాశం ఉంది.

Exit mobile version