అభిమానుల కోసం సప్రైజ్ ప్లాన్ చేసిన నాని !

22nd, February 2017 - 02:13:25 PM


వరుసగా 6 బ్యాక్ టు బ్యాక్ హిట్లందుకుని విజయోత్సాహంలో ఉన్న హీరో నాని తన అభిమానుల కోసం సప్రైజ్ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు శివ నిర్వానంద్ డైరెక్షన్లో తన 19వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలో చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తోంది. ఈ నెల 24న నాని పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ రేపు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే నాని నుండి వచ్చిన ఆరు మంచి సినిమాల్ని చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు రేపు ప్రకటించబోయే చిత్రం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుసూస్తున్నారు. ఇందులో నానికి జోడీగా నివేత థామస్ నటిస్తోంది. నాని వరుస హిట్లతో ఒకటైన ‘జెంటిల్మెన్’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేత ఆ చిత్రంలో నానికి పోటీగా నటించి అందరి ప్రసంశలు అందుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.