హీరో నాని తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ విషయంలో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌పై హుందాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక నోట్‌ను విడుదల చేస్తూ, ప్రేక్షకులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరి రియాక్షన్స్, రెస్పాన్స్ చూశానని నాని పేర్కొన్నారు. “మీరు చూపించిన ప్రేమను అందుకున్నా.. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన హిలేరియస్ ట్రోల్స్‌ను కూడా అంతే సరదాగా ఎంజాయ్ చేశా” అని చెప్పారు. ప్రేక్షకులు ఈ సినిమాను తమదిగా భావించి ఓన్ చేసుకున్న విధానం తన మనసును హత్తుకుందని తెలిపారు. ఇదే సమయంలో క్రిటిక్స్, రివ్యూవర్స్ ఎత్తిచూపిన లోపాల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు నాని స్పష్టం చేశారు.
ప్రేక్షకులకు ఒక సరికొత్త, వినూత్నమైన అనుభవాన్ని పంచాలనే లక్ష్యంతో ఎంతో రక్తం, చెమట ధారపోసి కష్టపడి ‘ది ప్యారడైజ్’ రూపొందించామని ఆయన రాసుకొచ్చారు. “ఇప్పుడు ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారా లేక జడ్జ్ చేస్తారా అనేది పూర్తిగా మీ ఇష్టానికే వదిలేస్తున్నా” అని పేర్కొన్నారు. చిత్రం పట్ల చూపించిన ఉత్సాహం, తనపై కురిపించిన ప్రేమాభిమానాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ నాని తన పోస్ట్‌ను ముగించారు.
I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
Thank you for everything is…
— Nani (@NameisNani) September 25, 2026
