“జయమ్మ పంచాయితీ” నుంచి ‘తిప్పగలనా’ పాట ను విడుదల చేసిన నాని

“జయమ్మ పంచాయితీ” నుంచి ‘తిప్పగలనా’ పాట ను విడుదల చేసిన నాని

Published on Nov 23, 2021 5:41 PM IST

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ వెండితెర పై కనిపించబోతున్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీవపాళి సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ కు విశేషమైన స్పందన వచ్చింది. నేడు ఈ సినిమాలోని మొదటి పాట తిప్పగలనా? లిరికల్ వీడియోను నేచుర‌ల్ స్టార్‌ నాని విడుదల చేశారు. ఇందులో విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. ఈ పాటలో సుమ ఫ్యామిలీని కూడా చూపించారు.

ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా, పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించగా, రామాంజనేయులు సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుండగా, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సుమ కనకాల, దేవీ ప్రసాద్, దినేష్, షాలినీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ విజయ్ కుమార్ కలివారపు అందిస్తున్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, డీఓపీ అనుష్ కుమార్, ఎడిటర్ రవితేజ గిరిజాల లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు