“అతిథి దేవోభవ” ట్రైలర్ ను లాంఛ్ చేయనున్న హీరో నాని

Published on Jan 5, 2022 1:30 pm IST

ఆది సాయికుమార్ హీరోగా, నువేక్షా హీరోయిన్ గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అతిథి దేవోభవ. ఈ చిత్రం ను జనవరి 7 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు మిర్యాల మరియు అశోక్ రెడ్డి మిర్యాల లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ నేడు సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది. టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. జనవరి 7 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :