రాజకీయ విభేదాలను పక్కన పెట్టండి…సినిమా సభ్యుడిగా అభ్యర్దిస్తున్నా – నాని

Published on Sep 26, 2021 3:20 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సినిమా లు విడుదల అవుతున్నప్పటికీ, టికెట్ల ధరల విషయం పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చలు జరిపినా, ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక లో చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఈ మేరకు పలువురు సినీ పరిశ్రమ కి చెందిన వారు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఈ మేరకు న్యాచురల్ స్టార్ నాని తాజాగా ఈ సమస్యల పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ సర్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యన ఉన్న విభేదాలను పక్కన పెట్టండి, ఇప్పటికే సినీ పరిశ్రమ కి చెందిన సమస్యలు తెలుప బడ్డాయి. దీని పై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ద అవసరం అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.సినిమా సోదరుల సభ్యుడి గా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి మరియు సంబంధిత మంత్రులను వినయం గా అభ్యర్దిస్తున్నా, సినిమా పునరుద్దరణ కి ఆలస్యం అయ్యే లోపు పరిష్కరించండి అంటూ చెప్పుకొచ్చారు. గతం లో సైతం నాని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల అంశం పై ప్రస్తావించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొకసారి స్టేజ్ పై నిలదీయడం తో, నాని మద్దతు గా వ్యాఖ్యలు చేయడం చర్చాంశనీయం గా మారింది.

సంబంధిత సమాచారం :