రాహుల్ రామకృష్ణ “NET” సినిమా పై నాని కామెంట్స్!

Published on Sep 5, 2021 5:57 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం ఈ నెల 10 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేయనున్నారు. అయితే ఇదే రోజున రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన నెట్ చిత్రం సైతం విడుదల కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా లో ఈ చిత్రం పై ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది.

రాహుల్ రామకృష్ణ తనకు అభిమాని అని చెబుతూనే తన సినిమా గురించి ప్రస్తావించడం జరిగింది. తన సినిమా కూడా ఈ సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల అవుతున్న విషయాన్ని చెప్పడమే కాకుండా, బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అందుకు నాని ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. నా వల్లే ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోత మావ ఇడి కెచ్చి అంటూ చెప్పుకొచ్చారు. నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సెప్టెంబర్ 10 వ తేదీన ఈ రెండు సినిమాలు విడుదల అవుతుండటం పట్ల ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ విషెస్ తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :