ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “అంటే సుందరానికీ”..!

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “అంటే సుందరానికీ”..!

Published on Jul 10, 2022 8:00 AM IST

ఈ ఏడాది మన టాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ క్లీన్ హిట్ చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా మొదటి సారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ చిత్రం “అంటే సుందరానికీ”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రం నాని కెరీర్ లో ఒక బెస్ట్ సినిమాగా నిలిచింది. మరి ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ప్రపంచ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మరి తెలుగుతో పాటుగా తమిళ్ మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా చిత్ర యూనిట్ కూడా ఇంట్రెస్టింగ్ వీడియోతో స్ట్రీమింగ్ పై తమ రెస్పాన్స్ ని పంచుకున్నారు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు