నానీ ‘చుందరం’ ప్రమోషన్ సూపర్ హిట్ అయ్యిందిగా.!

Published on Feb 4, 2022 9:00 am IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” తో తన కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది. హిట్ గానే కాకుండా సాలిడ్ కం బ్యాక్ గా కూడా ఈ సినిమా నిలిచింది. దీనితో ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన మిగతా సినిమాలపై మరిన్ని అంచనాలు కూడా నెలకొన్నాయి. పైగా ఒక్కో సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోనే ఉండడంతో ఆడియెన్స్ లో మళ్ళీ నానీ ఈజ్ బ్యాక్ అనే టాక్ వచ్చింది.

అలా ఇప్పుడు తాను చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో “అంటే సుందరానికి” కూడా ఒకటి. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ కి కంప్లీట్ అయ్యి రిలీజ్ కి రెడీగా ఉండగా నిన్న ఉహించని విధంగా ఏకంగా 7 డేట్ లు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ అందరు రెండు డేట్స్ అనౌన్స్ చేస్తుంటే మేము లేదు చేయకూడదా అని స్టార్ట్ చేసిన ట్రెండ్ సూపర్ గా క్లిక్ అయ్యిందని చెప్పాలి.

కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గాల్లో మరియు మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చుందరం ఇచ్చిన చమక్కు లాంటి ప్రమోషన్ ట్రిక్ చూసి నవ్వుకుంటున్నారు. దీనితో “అంటే సుందరానికి” మరింత రీచ్ దక్కినట్టు అయ్యింది. మరి మున్ముందు ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :